Thadeplli Local News :చాతుర్మాస దీక్షలో శ్రీ మాతంగానందగిరి మహాస్వామి విజ్ఞప్తి- లోక కల్యాణార్థం ఆధ్యాత్మిక చింతన అవసరం

Sharat
1 View

సీతానగరం (తాడేపల్లి):-గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం గ్రామంలో చాతుర్మాస దీక్షా నిమిత్తం వేంచేసిన శ్రీ మాతంగ మహాపీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మాతంగానందగిరి మహాస్వాముల వారిని భక్తులు విశేషంగా దర్శించుకుని, వారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ, చాతుర్మాస దీక్ష ఎంతో పవిత్రమైనదని, శ్రీ మాతంగి అమ్మవారి దివ్యానుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై సదా ఉండాలని ఆకాంక్షించారు. లోక కల్యాణార్థం తలపెట్టే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని స్వామివారు ఆశీర్వదించారు.

అనంతరం, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వామివారి అమృతహస్తాల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ — సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక చింతనను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ, ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్న శ్రీ మాతంగానందగిరి మహాస్వాముల వారు సీతానగరం విచ్చేయడం ఎంతో సంతోషదాయకమని పేర్కొంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో కాకుమాను భోగేశ్వరరావు, కుంగితల గోవిందస్వామి, గుంటూరు సత్యవతి, రాధిక, ఇందిర, మోహన్‌రావులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review