GUNTUR CRIME NEWS: పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసు ఛేదన

Karthik

పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మొత్తం 68 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల్లో 50 గ్రాముల నాగాభరణం, రెండు బంగారు మంగళసూత్రాలు, బంగారు గుత్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు Cr.No.448/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, చోరీకి పాల్పడిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

Author
Share This Article
Leave a review