Guntur District News :జనసేన స్థానిక సంస్థల ఎన్నికల అవగాహనా కార్యక్రమం

Sharat
1 View

తాడేపల్లి: 09-09-2026:- జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్‌లో జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కోఆర్డినేషన్ టీం సభ్యులు ఆళ్ల అనిల్ కుమార్, సోమరావతు అనురాధ, మత్తి భాస్కరరావు పాల్గొన్నారు. అలాగే సపోర్టింగ్ టీం సభ్యులు జి. మల్లేశ్వరరావు, కారుమూరి ఆంజనేష్, సోమిశెట్టి ప్రేమ్ కిరణ్ కుమార్, వెంకయ్య నాయుడు, ఏ. పృథ్వి, నాగరాజు, మణికంఠ తదితరులు హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహనతో ముందుకు సాగడం వంటి అంశాలపై కార్యక్రమంలో దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Author
Share This Article
Leave a review