అమీర్పేట , హైదరాబాద్(city news తెలుగు ):
అమీర్పేట్ ధర్మకరం రోడ్డులోని ఆశ్రయ్ మెడోస్ అపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయని ఆశ్రయ్ మెడోస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.*అసోసియేషన్ ఆరోపణలు ఇవే:*- నిర్మాణ సమయంలో భవనాలను పూర్తిగా నివాస అవసరాలకే వినియోగిస్తామని సంబంధిత వ్యక్తులు MOU ద్వారా హామీ ఇచ్చారని, ఆ హామీ ఆధారంగానే పలు కుటుంబాలు ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.- నిర్మాణం పూర్తయిన తర్వాత కొన్ని భవనాలను నివాసానికి బదులుగా వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.- వాణిజ్య అవసరాల కోసం బయట వ్యక్తుల రాకపోకలు పెరగడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు భద్రతాపరమైన ఆందోళనలు ఎదుర్కొంటున్నారని వాపోయారు.- దీనిపై ప్రశ్నిస్తున్న నివాసితులను కొందరు భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్న భవనాలకు సంబంధిత అనుమతులు ఉన్నాయా, నిర్మాణ అనుమతులు ఏ ప్రయోజనం కోసం మంజూరయ్యాయి అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అసోసియేషన్ కోరింది.నిర్మాణ అనుమతులు, భవన వినియోగ పత్రాలు, MOUలు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య వినియోగం జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇది కేవలం అపార్ట్మెంట్ అంతర్గత వివాదంగా కాకుండా భవన వినియోగ నిబంధనలు, నివాసితుల భద్రత, ప్రశాంతతకు సంబంధించిన అంశంగా పరిగణించి తక్షణ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



