సెప్టెంబర్ 24న సీపీఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల అర్జీదారుల సదస్సు. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలకు సొంత ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సీపీఐ గుంటూరు నగర సమితి డిమాండ్ చేసింది. ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో సొంత ఇల్లు లేని అర్హులైన నిరుపేదల కోసం ఇంటి స్థలాల అర్జీదారుల సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. గుంటూరు నగర పరిధిలో సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలం, గృహ నిర్మాణ సాయం అందే వరకు సీపీఐ ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుందని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలు, సొంత ఇల్లు లేని కుటుంబాలు సెప్టెంబర్ 24న జరిగే సదస్సుకు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ మీడియా సమావేశంలో సీపీఐ గుంటూరు నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్నా తదితరులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి స్థలం కల్పించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
25°C
Vijayawada
overcast clouds
25° _ 25°
95%
5 km/h
Wed
25 °C
Thu
25 °C
Fri
27 °C


