Krishna district City news :మన పిల్లలు మన బాధ్యత.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి-ఒక్కసారి ప్రయత్నిద్దామనే ఆలోచన కూడా ప్రమాదకరం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

S Sarath
2 Views

గుడివాడ: డ్రగ్స్‌ మహమ్మారిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు యాహు సంస్థ, వెనిగండ్ల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడలో ‘మన పిల్లలు మన బాధ్యత’ పేరుతో డ్రగ్స్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సుఖద దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఐ లవ్ గుడివాడ’ అంటూ విద్యార్థులతో నినాదాలు చేయించారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో.. లైఫ్ ముద్దు బ్రో’ అంటూ విద్యార్థులు నినదించారు.Gudivada Local News :డ్రగ్స్ రహిత సమాజం కోసం యువ వైద్యుల అవగాహన ర్యాలీ

‘ఒక్కసారి చూద్దాం.. ఒక్కసారి ప్రయత్నిద్దాం’ అనే ఆలోచన కూడా ప్రమాదకరమేనని ఎమ్మెల్యే రాము హెచ్చరించారు. డ్రగ్స్‌కు ఒక్కసారి అలవాటు పడితే ఆరోగ్యం, చదువు, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.

పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గుడివాడలో డ్రగ్స్‌ వినియోగం లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే 1972కు సమాచారం అందించాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు.

Author
Share This Article
Leave a review