Bapatla City news :(SIR) కార్యక్రమంపై చిన్నగంజాం మండలంలో తెలుగుదేశం పార్టీ బీఎల్ఏలకు అవగాహన శిక్షణ కార్యక్రమం

Sharat
19 Views



బాపట్ల జిల్లా:- పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో తహసీల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పొద వీరయ్య చౌదరి అధ్యక్షతన ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. మండలంలోని 37 మంది బీఎల్ఏలకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం లక్ష్యాలు, విధివిధానాలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి సయ్యద్ అబ్దుల్ కలాం ఆజాద్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నరహరి శ్రీను, చెరుకూరి రాఘవయ్య, సందు శ్రీనివాసరావు, వడ్లమూడి సత్యం, రాజు ఉదయభాస్కర్ రెడ్డి, దండ్రుప్రోలు తిరుపతిరావు, కారాని నరసింహారావు, పెద్దసింగు ఏడుకొండలు, అనిల్, సుబ్బయ్య, ఊసమల్లి, ఏసు నారాయణతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బీఎల్ఏలు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

Author
Share This Article
Leave a review