GUNTUR DISTRICT NEWS: పనుల్లో జాప్యం చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి – డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి.

Karthik

*పనుల్లో జాప్యం చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి* * డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి* అన్ని ప్రాంతాలలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి* క్షేత్రస్థాయిలో పర్యటించే సమస్యలు తెలుసుకుంటున్నాం* గత వైసీపీలో నియోజకవర్గ అభివృద్ధి పదేళ్లు వెనక్కి* వివిధ ప్రాంతాల్లో పర్యటించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో, ప్రతి గడపలో సమస్యలను తెలుసుకునేందుకు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం మద్దిరాల‌కాలనీ, మంగళదాస్ నగర్, రాజగోపాల్ నగర్, బసవతారక‌నగర్, గడ్డిపాడు ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్దిరాల కాలనీలో రోడ్ల నిర్మాణంలో అలసత్వంపై అధికారులను ప్రశ్నించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్దిష్ట సమయంలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగితే మాత్రం సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. వర్షాకాలం కావడంతో డ్రెయిన్ల నిర్మాణంలో వేగవంతంగా పనులు చేపట్టాలన్నారు. దీనిపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మున్సిపల్ అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించి నిధులు రాబట్టగలుగుతున్నామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని పదేళ్లు అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లారని, కనీసం ప్రధాన రోడ్లలోనూ తట్టమట్టి వేసిన దాఖలాలు లేవని విమర్శించారు.

Author
Share This Article
Leave a review