Tirupathi District City News :జనసేనకు గుడ్‌బై.. వైఎస్సార్‌సీపీలోకి గూడూరు వెంకటేశ్వర్లు-నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక.. మున్సిపల్ ఎన్నికల వేళ వెంకటగిరిలో రాజకీయ ప్రాధాన్యత

S Sarath
1 View

వెంకటగిరి, అక్టోబర్ 16: మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత గూడూరు వెంకటేశ్వర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. రామ్‌కుమార్ రెడ్డి గూడూరు వెంకటేశ్వర్లుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

వైఎస్సార్, నేదురుమల్లి కుటుంబాలపై విశ్వాసం

ఈ సందర్భంగా గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆదరణ పొందిన కుటుంబంగా వైఎస్సార్ కుటుంబం నిలిచిందని, వెంకటగిరిలో ప్రజల మద్దతు పొందిన కుటుంబంగా నేదురుమల్లి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అలాంటి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీలో పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు.

రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.Tirupathi district City News

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

గూడూరు వెంకటేశ్వర్లు చేరిక సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలు వైఎస్సార్‌సీపీకి మరింత బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ ప్రతినిధి కోడూరు కల్పలతతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన సీనియర్ నేత గూడూరు వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీలో చేరడం వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Author
Share This Article
Leave a review