Guntur District City News :బీసీలకు 40 శాతం పార్టీ పదవుల కేటాయింపును స్వాగతిస్తున్నాం-స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధ రక్షణ కల్పించాలి

S Sarath
1 View

మంగళగిరి:-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, బీసీల మనోభావాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పరంగా 40 శాతం బీసీలకు ప్రాధాన్యత కల్పించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు తెలిపారు.

మంగళగిరిలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో కేశవ శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన ప్రాతినిధ్యంపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రతిపాదించిన రిజర్వేషన్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొత్తం సగటున 28.18 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. అయితే, బీసీల జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాతినిధ్యం లభించేలా భవిష్యత్తులో చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.Mangalagiri Local News :హస్తకళలకు సాంకేతికత జోడిస్తే కళాకారులకు కొత్త అవకాశాలు-(APHDC) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

బీసీల హక్కులకు భరోసా కల్పించేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బీసీల అభ్యున్నతి, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేసి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.

ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా అశోక్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు బాదుగున్నల శ్రీనివాస్, శివరాం బాబాజీతో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review