గుంటూరు నగరంలో ఎకో పార్క్ లో నాటిన వెయ్యి మొక్కలను సంరక్షించే బాధ్యతను చేయూత ఫౌండేషన్ చేపట్టి ఈనెల 29వ తేదీన గుంటూరులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు టిజెపిఎస్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని చేయూత ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మరియు సౌత్ కొస్టల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ ఎస్. మంజునాథ్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సగటున ఒక్కొక్కరికి 422 చెట్లు ఉండగా ఇండియాలో 28 చెట్లు మాత్రమే ఉన్నాయని కెనడాలో 8953 చెట్లు, రష్యాలో 4461 చెట్లు,ఆస్ట్రేలియాలో 3266 చెట్లతో అగ్రభాగాన ఉన్నాయని ఈజిప్ట్, ఖదర్, ఉమెన్, మొనాకో లాంటి దేశాలలో ఒక చెట్టు లోపు మాత్రమే ఉంటూ అత్యల్ప స్థాయిలో ఉన్నాయన్నారు. ప్రపంచ భూభాగంలో 31 శాతం అడవులు ఉండగా ఇండియాలో 25 శాతం,ఆంధ్రప్రదేశ్ 18 శాతం గా ఉంటే గుంటూరు జిల్లాలో కేవలం 7 శాతంతో అతి తక్కువ స్థాయిలో ఉందన్నారు. ప్రపంచంలో ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో కోట్లాది మొక్కలు నాటి సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణీకరణ, రోడ్ల విస్తరణ, మైనింగ్,జనాభా పెరుగుదల లాంటి కారణాలతో చెట్లు నరికివేత పెరుగుతుందని మనదేశంలో 500 కోట్ల చెట్లను పెంచితే గాని పర్యావరణాన్ని కాపాడుకోలేమన్నారు. గత 80 సంవత్సరాలలో నాటిన కోట్లాది మొక్కలలో కేవలం రెండు శాతం మాత్రమే మొక్కలను సంరక్షించి చెట్లగా పెంచగలిగామన్నారు. సౌత్ కొస్టల్ రైల్వేస్ మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ ఎస్. మంజునాథ్ ప్రసంగిస్తూ నెలరోజుల క్రితం ఎకో పార్కులో నాటిన వేయి మొక్కల్లో కేవలం ఒక శాతం మాత్రమే చనిపోయాయని తెలిపారు. ప్రముఖ సేవా తత్పరులు రేమాండ్స్ అధినేత త్రిపుర మల్లు అరుణ్ కుమార్ ఉచితంగా అందించిన ట్యాంకర్ తో మొక్కలకు నిరంతరం నీరు అందిస్తున్నామని వివరించారు. బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కోవిడ్ ఫైటర్స్ మొక్కలకు నిరంతరం నీరు అందించే బాధ్యతను స్వీకరించడం అభినందనీయమన్నారు. టిజెపిఎస్ మరియు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలకు నీరు సమృద్ధిగా అందించడానికి పాదులు చేసి వాటికి చేయూత నివ్వడానికి కర్రలు ఉంచటం ,చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటడం లాంటి కార్యక్రమాలను జయ ప్రదంగా నిర్వహించి పని సంస్కృతికి నిదర్శనంగా నిలిచినారన్నారు. ఈ కార్యక్రమంలో టిజెపిఎస్ కళాశాల అధ్యాపకులు గుంటూరు జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి డా|| జె.వి. సుధీర్ కుమార్, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బొందిలి పవన్ సాయి రామ్ సింగ్, ల్యాబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ షేక్ ఖాదర్ బాషా, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు షేక్ పఠాన్ అల్లాబక్షు, మానవత అధ్యక్షులు పోలూరి వీరారెడ్డి, సభ్యులు టి.వి. సాయిరాం, మేకల రామారావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి, కెబిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలరాజు, ప్రముఖ ప్రజా గాయకులు పి.వి. రమణ, పవన్ జోవిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు పవన్, చేయూత ఫౌండేషన్ సభ్యులు టి. ధనుంజయ రెడ్డి, మాదిగ జన సేవా సమితి నేత పుసులూరి విజయ్, రైల్వే చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వంక రామశేషారెడ్డి మొక్కల సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సదుపాయం ప్రముఖ వ్యాపారవేత్త వణుకూరి సుబ్బారెడ్డి కల్పించినారు.
GUNTUR DISTRICT NEWS: మొక్కల సంరక్షణలో చేయూత ఫౌండేషన్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
scattered clouds
27° _ 27°
82%
1 km/h
Wed
35 °C
Thu
33 °C
Fri
33 °C


