GUNTUR DISTRICT NEWS: భారీ వర్షాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Karthik

అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సమాచారాన్ని తెలుసుకోవచ్చని, ప్రజలు కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Author
Share This Article
Leave a review