గుంటూరు నగరంలోని విజయపురి కాలనీ 8వ లైనులో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తోపాటు కోవెలమూడి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి సాదర స్వాగతం పలికారు. సభలో నగర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ సాగిన ఈ బహిరంగ సభ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.



