గుంటూరు, అక్టోబర్ 29:-శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పి.వి. రాజీవ్ మాట్లాడుతూ విద్యుత్, నీటి సరఫరా, రవాణా, టెలిఫోన్, ఆసుపత్రులు, బీమా తదితర ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాల్లో అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కార మార్గాలను వివరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
పారా లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకం
అనంతరం పారా లీగల్ వాలంటీర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.వి. రాజీవ్ మాట్లాడుతూ సమాజంలో పారా లీగల్ వాలంటీర్ల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి, వారికి తగిన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారుల ద్వారా అందుబాటులో ఉన్న చట్టపరమైన సేవలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
- గుంటూరు, అక్టోబర్ 29:-శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పి.వి. రాజీవ్ మాట్లాడుతూ విద్యుత్, నీటి సరఫరా, రవాణా, టెలిఫోన్, ఆసుపత్రులు, బీమా తదితర ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాల్లో అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కార మార్గాలను వివరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
- పారా లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకం
సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాలను చిన్న చిన్న ఉదాహరణలతో వివరిస్తూ, బాధితులకు సరైన న్యాయ సహాయం అందించడంలో వాలంటీర్లు అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు.Guntur City News
ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, ప్యానెల్ అడ్వకేట్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.



