NATIONAL NEWS: శత వసంతంలో కి ప్రవేశించిన…. లాల్ కృష్ణ అద్వానీ

Karthik

భారతీయ చరిత్రలో సువర్ణ అధ్యాయం దక్కింది. భారత రాజకీయాల్లో ” ఉక్కు మనిషి” దేశ దశ దిశను మార్చిన…మహనీయుడు. దేశంలోనే సీనియర్ నాయకుడు, జీవించి ఉన్న నేతలలో అగ్రగణ్యుడు, బిజెపి పితామహుడు అద్వానీ వందో సంవత్సరంలోకి ప్రవేశించారు. తన రామ రథ యాత్ర ద్వారా దేశంలో బిజెపి అధికారానికి బాటలు వేసిన సారథి, మహారధి , లాల్ కృష్ణ అద్వానీ శత వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన 99 ఏళ్లు ముగించుకొని వందో సంవత్సరంలోకి దీపావళి రోజునే ప్రవేశించారు . 1927 నవంబర్ 8వ తేదీ దేశ విభజనకు ముందు కరాచీలో ఆయన జన్మించారు. భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకులలో ఆయన కూడా ఒక ఒకరు. వాజ్ పాయికి చేదోడు వాదోడుగా, పార్టీ నిర్మాణంలో ఆయన అనితర సాధ్యమైన, అసాధ్యమైన చరిత్ర స్వంతం చేసుకున్నారు. ఆయన చేపట్టిన రామరథ యాత్ర బీజేపీకి ఊపిరి పోసింది. దేశానికి ఉప ప్రధానిగా , హోం మంత్రిగానూ పనిచేసిన ఆ రాజకీయ మేరునగ ధీరుడిని 2024లో భారతరత్నతో సత్కరించారు..

Author
Share This Article
Leave a review