GUNTUR DISTRICT NEWS: పి.జి.ఆర్.ఎస్ రద్దు

Karthik

ఎన్నికల విధులలో అధికారులందరూ నిమగ్నం కావడం వలన మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ ను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించి సోమవారం వ్యయప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review