షైనింగ్ స్టార్స్… మీరు స్ఫూర్తిప్రదాతలు:Shining Stars 2026: You Are an Inspiration, Says Guntur District Collector

City News Telugu

పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రతిభావంతులకు “షైనింగ్ స్టార్స్–2026” గౌరవ సత్కారం

CITY NEWS TELUGU | గుంటూరు | జూలై 20:
విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇతరులకు స్ఫూర్తిప్రదాతలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను అభినందిస్తూ సోమవారం పొన్నూరు రహదారిలోని బి కన్వెన్షన్‌లో “షైనింగ్ స్టార్స్–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 137 మంది పదో తరగతి విద్యార్థులు, 40 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిపి మొత్తం 177 మందిని షైనింగ్ స్టార్స్–2026గా సత్కరించారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, షైనింగ్ స్టార్స్ సర్టిఫికెట్ అందజేశారు. మొత్తం 177 మంది విద్యార్థులకు రూ.35.40 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందించారు.

ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్లు

ప్రభుత్వ పాఠశాలల విభాగంలో తాడేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన నెహాల్ జెట్లింగ్ 593 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. గోగులమూడి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పఠాన్ మాహి ఆఫ్రిన్ 592, అత్తోట జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కటికి అనూష 589, కాకుమాను జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కంకణాల శ్రీకాంత్ 588, మున్నంగి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కేసని యమున శ్రీ 585 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

ప్రైవేట్ పాఠశాలల జిల్లా టాపర్లుJoin Our News Team

ప్రైవేట్ పాఠశాలల విభాగంలో పొన్నెకల్లులోని శ్రీ సాయి హైస్కూల్‌కు చెందిన పాలేరు ఉజ్వల్ చౌదరి, గుంటూరు భాష్యం హైస్కూల్‌కు చెందిన గంగోలు దినేష్, లక్ష్మీపురం శ్రీ చైతన్య స్కూల్‌కు చెందిన పలకలూరి స్వేచ్ఛా ప్రియదర్శిని, మంగళగిరి శ్రీ చైతన్య స్కూల్‌కు చెందిన పిడపర్తి సాయి శ్రీహర్ష ఒక్కొక్కరు 598 మార్కులు సాధించారు. తాడేపల్లి విద్యాపీఠం స్కూల్‌కు చెందిన కూనపరెడ్డి ఆకాంక్ష 597 మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులు సాధించిన విజయాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విజయాన్ని తొలి మెట్టుగా భావించి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తమ్ముళ్లు, చెల్లెళ్లకు స్ఫూర్తిగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.

ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తూ సాంకేతికతను అందిపుచ్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనే విజయం ఉందన్నారు. మార్కులతో పాటు సామాజిక స్పృహ, ధైర్యం, చొరవ పెంపొందించుకోవాలని, మంచి వ్యక్తులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు.Live IPL UPdates

ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఉన్నత విద్యతో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం పెరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా తమ భవిష్యత్తును చక్కగా మలచుకొని విశ్వమే హద్దుగా ఎదగాలని ఆకాంక్షించారు.

లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ విద్యతో సంస్కారం పెరుగుతుందని, విద్యార్థులు షైనింగ్ స్టార్స్‌గా కొనసాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ షైనింగ్ స్టార్స్ కార్యక్రమం తమకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వంద రోజుల కార్యక్రమం, “విజయం మనదే”, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లుReporter Dashboard తమ చదువులకు ఎంతో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి డా. షేక్ సలీం భాషా, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జె. పద్మ, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి. సునీత, సమగ్ర శిక్ష ఏపీసీ పద్మావతి, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, తహసీల్దార్ సుభాని, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a review