Guntur District News :స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో భాగస్వాములవుదాం-ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్

Sharat
1 View

పెదకాకాని : -పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పొన్నూరు శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్రకుమార్ పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలోని శివాలయం రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోగలమని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని దత్తత తీసుకున్నట్లు కాపాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, స్థానిక నాయకులు మరియు అపార్ట్‌మెంట్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review