గుంటూరులో గ్రంధాలయ వారోత్సవాలు

Karthik

మహిళా బాలల గ్రంథాలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు నందు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ భీమినేని వందనా దేవి, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, డిప్యూటీ లైబ్రేరియన్ కందుల ఝాన్సీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మ్యూజిక్ టీచర్ వై. శివాజీ ఆధ్వర్యంలో మ్యూజిక్ పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పుస్తక పఠనం మరియు గ్రంధాలయ ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాథికారి బి. శకుంతల, గ్రంథాలయ సిబ్బంది వి. గిరిష్ కుమార్ , పి. కోటేశ్వరి , లక్ష్మి , విద్యార్థిని, విద్యార్థులు మరియు గ్రంథాలయ పాఠకులు మొత్తం 55 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author
Share This Article
Leave a review