
యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం:
వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశువుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని పర్చూరు నియోజకవర్గానికి 90 టన్నుల పశువుల దాణాను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చిన్నగంజాం మండల టీడీపీ అధ్యక్షుడు నరహరి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నరహరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పశువులను కేవలం ఆదాయ వనరులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించి సంరక్షించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పశువుల దాణాను మంజూరు చేయించారని పేర్కొన్నారు.About Us
మొత్తం 90 టన్నుల దాణాలో భాగంగా చిన్నగంజాం మండలానికి 15 టన్నులు కేటాయించడం పట్ల మండలంలోని పశుపోషకుల తరఫున ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు దాణా అందించడం రైతులకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఇట్లు: నరహరి శ్రీనివాసరావు, చిన్నగంజాం మండల టీడీపీ అధ్యక్షుడు, మరియు చిన్నగంజాం మండల తెలుగుదేశం పార్టీ.
SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES



