AP POLITICAL NEWS: హత్యలు చేయడం, సాక్షులను మాయం చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య

Karthik
12 Views

గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి రుజువైందని బీసీ సంక్షేమ, చేనేత, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పెద్ద దస్తగిరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన బినామీగా ఉన్న దస్తగిరిని ఈరోజు జగన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం బలి తీసుకున్నారు. తన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జగన్ రెడ్డి సొంత మనుషులనే వాడుకుని వదిలేస్తారనే దానికి ఈ హత్యే నిదర్శనం. గతంలో తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాలు చేయించుకున్న చరిత్ర జగన్ ది. గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించి సొంత బాబాయినే హతమార్చారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ‘డోర్ డెలివరీ’ చేసిన అరాచకాన్ని రాష్ట్రం మర్చిపోలేదు. దళిత వ్యక్తి సింగయ్య కూడా జగన్ కారు కిందే బలైపోయారు. అమర్నాథ్ గౌడ్ నుంచి నేడు దస్తగిరి వరకు.. బీసీలను కేవలం తమ అక్రమాలకు వాడుకుని, అవసరం తీరాక అడ్డుతొలగించుకోవడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు.

Author
Share This Article
Leave a review