కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్లపాడు – బండారుపల్లి స్టేషన్ల మధ్యన చేపట్టిన చినపలకలూరు ROB [రోడ్ ఓవర్ బ్రిడ్జి] శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు.గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడు ROBల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం చంద్రబాబు నాయుడుకి, ఈ ఆర్ ఓ బిల మంజూరుకు సహకరించిన సోమన్నకి, అశ్విని వైష్ణవ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. వీరందరి సహకారంతో ఈ రోజున మన జిల్లాలో మూడో ROB శంకుస్థాపనను చేయబోతున్నాం.త్వరలోనే మంగళగిరి ఆర్ఓబి కి కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని అంత వేగంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. గుంటూరులోని GGH లో రూ. 18 కోట్ల విలువైన పెట్ స్కాన్, వెంటిలేటర్లు, సర్వీస్ బ్లాకులు వంటి దాదాపు కొన్ని వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమలు చేస్తున్నాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, డ్రైన్ల నిమిత్తం రూ. 400 కోట్ల నిధులతో పనులు చేస్తున్నాం.మానస సరోవర్, రైతు బజార్, నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంతో పాటు ఎన్నో ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు కాంపౌండ్ వాళ్ళు తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొని అమలు చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ – 3 నిర్మాణానికి గాను 800కు పైగా నివాసితులకు ఇబ్బంది కలగకుండా తరలించి, ప్రత్యామ్నాయాలు చూపించి, నష్టపరిహారం చెల్లించి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టాము.ఇంతటి శ్రమతో తీసుకువచ్చిన ఈ ROB నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచిస్తున్నామని చెప్పారు.కార్యక్రమం అనంతరం రైల్వే డిఆర్ఎం సుధేష్ణ సేన్ స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
GUNTUR DISTRICT NEWS: నల్లపాడు – బండారుపల్లి స్టేషన్ల మధ్య ROB కి శంకుస్థాపన

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
29°C
Vijayawada
overcast clouds
29° _ 29°
61%
5 km/h
Sun
33 °C
Mon
31 °C
Tue
36 °C


