విశాఖ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ 2026 లో సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్‌

Karthik

సమ్మిట్‌లో రూ.9.89 లక్షల కోట్ల విలువైన 303 ఎంవోయూలు చేసుకుంటాం.• వీటితో కలిపి జూన్‌ 2024 నుంచి రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్లు.• సమ్మిట్‌లో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు. విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు సంబంధించి 303 ఎంవోయూలు జరుగుతాయి.• మొత్తం రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడి ఆసక్తి. జూన్‌ 2024 నుంచి రాష్ట్రానికి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల ప్రతిపాదనలకు సమ్మిట్‌లోని రూ.9.89 లక్షల కోట్లు కలిపి మొత్తం రూ.32 లక్షల కోట్లు• సమ్మిట్‌ కు ముందు రూ.22.60 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు. • రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాల ఆమోదం. • రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధం. భూమి, ప్రోత్సాహకాల ఆమోదం పొందిన 526 ప్రాజెక్టుల్లో సంఖ్యాపరంగా 58 శాతం నిర్మాణ సన్నద్ధత దశకు చేరాయి.• పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 160 గిగావాట్లు లక్ష్యం. ఇప్పటికే 114 గిగావాట్ల సామర్థ్యానికి ఆమోదం• ఎలక్ట్రానిక్స్‌లో ఏటా రూ.4.20 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం. ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాల తయారీ విభాగాల్లో సుమారు రూ.31,926 కోట్ల విలువైన ప్రాజెక్టులకు రాష్ట్రం ఆమోదం • ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. అంతరిక్ష రంగానికి విడిగా రూ.25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం• ఆహార శుద్ధి రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం• దేశ పోర్టు సరకు రవాణాలో 20 శాతం వాటా లక్ష్యం. పోర్టుల సామర్థ్యం, రైలు అనుసంధానం, నౌకా నిర్మాణ క్లస్టర్ల అభివృద్ధికి ప్రాధాన్యం • ఐదో తరం యుద్ధవిమాన ప్రాజెక్టును 36 రోజుల్లో గ్రౌండింగ్‌ దశకు తెచ్చాం.• సోలార్‌ తయారీలో భారీ సామర్థ్యానికి ఆమోదం. రాష్ట్రంలో 42 గిగావాట్ల సోలార్‌ సెల్‌ తయారీ సామర్థ్యానికి, 53 గిగావాట్ల ఇంగట్‌, వేఫర్‌ తయారీ సామర్థ్యానికి ఆమోదం• ఏపీలో 4.6 గిగావాట్ల డేటా సెంటర్‌ ప్రాజెక్టులకు ఆమోదం. దేశంలో అప్పటికే ఏర్పాటైన డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్లు• అమరావతిలో 250 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్‌ తయారీ కేంద్రం. అమరావతి క్వాంటం వ్యాలీని దక్షిణాసియాలో తొలి ప్రాజెక్టు. 2027 ఫిబ్రవరి 3 తేదీన ప్రారంభిస్తాం.• సరకు నిర్వహణలో దేశంలో ఏపీకి నాలుగో స్థానం. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరు పోర్టుల వార్షిక సామర్థ్యం 346 మిలియన్‌ టన్నులు. 2025–26లో 209 మిలియన్‌ టన్నుల సరకు నిర్వహణ• నాలుగు కొత్త పోర్టులతో అదనంగా 108 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం. రామాయపట్నం పోర్టుకు 2027 ఏప్రిల్‌, మూలపేటకు జూన్‌, మచిలీపట్నానికి డిసెంబర్‌, కాకినాడ గేట్‌వేకు 2028 సెప్టెంబర్‌ లక్ష్యం • మూడు నౌకా నిర్మాణ క్లస్టర్లు, ఏడు కొత్త ఫిషింగ్‌ హార్బర్లు. దుగరాజపట్నం నౌకా నిర్మాణ క్లస్టర్‌కు 2028–29 కాలపరిమితి• ఏపీలో ప్రస్తుతం ఆరు విమానాశ్రయాలు. వీటి వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం 1.55 కోట్లు కాగా, 2025–26లో 62 లక్షల మంది ప్రయాణించారు.• తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ప్రణాళిక. భోగాపురం, అమరావతి, తిరుపతిని ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా గంటలో విమానాశ్రయానికి చేరుకునేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.• ఏపీ మీదుగా 839 కి.మీ. హైస్పీడ్‌ రైలు కారిడార్లు. ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు మార్గాలతో పాటు 4,415 కి.మీ.• పోలవరం ప్రాజెక్టు 2027 జూన్‌ నాటికి జాతికి అంకితం చేయాలన్నది లక్ష్యం• పోలవరం–బనకచర్ల అనుసంధానానికి సుమారు 200 టీఎంసీల ప్రతిపాదన. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఐదు నదులు, నాలుగు రాష్ట్రాలకు జలభద్రత కల్పించాలన్నది మా ఆలోచన• రాష్ట్రవ్యాప్తంగా 25 రంగాలవారీ పారిశ్రామిక పార్కులు. శ్రీకాకుళంలో కెమికల్‌ పార్క్‌, విశాఖలో మెడ్‌టెక్‌, అనకాపల్లిలో ఉక్కు అనుబంధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, ఏఐ డేటా సెంటర్‌ వంటి రంగాలను గుర్తించారు.• స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంగా పని చేస్తున్నాం

Author
Share This Article
Leave a review