Hyderabad City News :డాసోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నాగచైతన్య-జూబ్లీహిల్స్‌లో డాసోస్ క్యాబినెట్స్ సందర్శించిన సినీ నటుడు

S Sarath
1 View

హైదరాబాద్, అక్టోబర్ 4:- జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు నాగచైతన్య సందడి చేశారు. రోడ్ నంబర్ 45లోని డాసోస్ క్యాబినెట్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డాసోస్ సంస్థకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు నాగచైతన్య ప్రకటించారు.

మాడ్యులర్ క్యాబినెట్ల రంగంలో సేవలు అందిస్తున్న డాసోస్ సంస్థ తాజాగా పూర్తిస్థాయి లగ్జరీ ఇంటీరియర్స్ రంగంలోకి అడుగుపెట్టినట్లు మహిగ్రానైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ జి. కశ్యప్, డాసోస్ డైరెక్టర్ నీహారిక కశ్యప్ తెలిపారు. సంస్థ విస్తరణలో భాగంగా జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.Hyderabad City News

కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక డిజైన్‌లు, నాణ్యమైన ఇంటీరియర్ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా డాసోస్ ముందుకు సాగుతోందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నాగచైతన్య డాసోస్ ఉత్పత్తులు, లగ్జరీ ఇంటీరియర్ డిజైన్లను పరిశీలించారు.

Author
Share This Article
Leave a review