Markapur District City News :దద్దాల నారాయణ యాదవ్‌కు ఘన సన్మానం-జడ్పీటీసీగా పదవీకాలం పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు

S Sarath
5 Views

కనిగిరి:– హనుమంతునిపాడు మండల జడ్పీటీసీగా పదవీకాలం పూర్తి చేసుకున్న కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌కు ఘన సన్మానం జరిగింది. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ఆయనను సత్కరించారు.

మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి దద్దాల నారాయణ యాదవ్‌ను దుశ్శాలువ, పూలదండతో సత్కరించారు. అనంతరం షీల్డ్‌ను అందజేశారు.Markapur District City News :పల్లెపండుగ 3.0 విజయవంతంపై సమీక్ష సమావేశం-కార్యక్రమానికి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలి-ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

జడ్పీటీసీగా కొనసాగిన కాలంలో దద్దాల నారాయణ యాదవ్ అందించిన సేవలను నాయకులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review