దర్శి:– ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఉన్న ఎన్ఎస్పీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఉదయం అమ్మవారికి వివిధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో దేవస్థాన ప్రాంగణం సందడిగా మారింది.
మధ్యాహ్నం దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజూ రాత్రి ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భజన కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు లాటరీ పద్ధతిలో బహుమతులు అందజేస్తున్నారు.Prakasam district News
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.



