Kakinada District News :ఉప్పలపాడులో లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న-తుమ్మలపల్లి రమేష్

S Sarath
1 View

జగ్గంపేట (గండేపల్లి):-గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి ఆలయ 47వ వార్షికోత్సవం, గణపతి నవరాత్రులు మరియు సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం, విశేష అభిషేకాలు, దివ్య పూజా కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పర్వదినం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం భక్తుల జయ జయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగింది.వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులు అరెస్ట్.. 5 భారీ రికవరీ విశేషాలు!

దర్శనానంతరం భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురప్రముఖులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Author
Share This Article
Leave a review