దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఉన్న రామాలయం దేవస్థాన ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, తెలుగు యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.Prakasam district news :దర్శిలో ఉపశమనం- బానుడి తాపానికి వర్షంతో చెక్ — వర్షంలో తడిసిన రోడ్లు, ఉప్పొంగిన రైతాంగం
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి సొసైటీ అధ్యక్షుడు కలవకొలను చంద్రశేఖర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.



