chinthalapudi :-ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, “కూటమి ధర్మాన్ని పాటిస్తూ మనం గెలవగలిగే సత్తా ఉన్న నియోజకవర్గాలు/స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తాం. టీడీపీ, బీజేపీకి బలం ఉన్న చోట వారికి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో ఈ వివరాలను వివరించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశం ప్రాంగణంలో మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్య అతిథులు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.Eluru District City News
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు కరాటం సాయి, చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ చీదరాల దుర్గా పార్వతి మధు బాబు, జనసేన చింతలపూడి మండల పార్టీ అధ్యక్షుడు చీదరాల మధుబాబుతో పాటు పలువురు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.



