ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతి, సంతృప్తి స్థాయి పెంచేందుకు దేవాదాయశాఖ ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని కమీషనర్ సందర్శించారు. ఆలయ కమిటీ చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ఈవో గోగినేని లీలా కుమార్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆలయంలోని భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ గురించి పరిశీలన చేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఆలయాల్లో భక్తుల సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఆలయాలకు వచ్చే వారికి ఆధ్యాత్మిక చింతన కలిగించడం జరుగుతుంది. పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రీనరీ, వైదిక కార్యక్రమాలు నిర్వహించడం, నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా దేవాలయాలలో సేవా కార్యక్రమాలు చేసేందుకు లక్ష మంది స్వచ్ఛంద సేవకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ సంఖ్యను భవిష్యత్తులో మరింతగా పెంచి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపడతామని కమీషనర్ ప్రకటించారు. పెదకాకాని శివాలయంలో ప్రతి రోజూ 1500 మందికి అన్నదానం చేసే ఏర్పాటు చేస్తున్నట్లు కమీషనర్ స్పష్టం చేశారు.
GUNTUR DISTRICT NEWS: పెదకాకాని శివాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
broken clouds
27° _ 27°
70%
2 km/h
Sun
27 °C
Mon
34 °C
Tue
34 °C


