GUNTUR DISTRICT NEWS: ఒక కుటుంబంలో – ఒక పారిశ్రామికవేత్త ఉండాలి

Karthik
1 View

కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఉపాధికి అవకాశం ఉన్న అనేక పోజెక్టులు ఉన్నాయని, వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ కౌశల్య యోజన క్రింద జిల్లాలో గ్రామీణ యువతను గుర్తించి నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వీరికి శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్లేస్మెంట్ చూపించడం జరుగుతుందని అన్నారు. వృథాగా పోతున్న పువ్వులు నుండి అగరొత్తులు తయారు చేయుటకు కొంత మంది లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులు పావని చేసిన సూచన మేరకు తెలిపారు. ఎం.ఎస్.ఎం.ఇ క్లెయిమ్ ల క్రింద 20 మందికి రూ.2.24 కోట్లకు కమిటీ ఆమోదించింది. సింగిల్ డెస్క్ పాలసీ క్రింద 24 దరఖాస్తులను ఆమోదించింది. మంగళగిరి ఆటో నగర్, గోరంట్ల ఇండస్ట్రియల్ పార్క్ లలో నడుస్తున్న మూడు సంస్థలు తమ కార్యకలాపాలను మార్పు చేయుటకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, ఉప సంచాలకులు ప్రదీప్ కుమార్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ఎం.నరసింహారావు, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం, పర్యాటక అధికారి ఏ.రమ్య, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం, ఎల్.డి.ఎం మహిపాల్ రెడ్డి, నాబార్డు డి.డి.ఎం శరత్, ఆర్.టి.ఓ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review