GUNTUR DISTRICT NEWS: ఈనెల 6న కాకుమాను, పెదనందిపాడు, ఫిరంగిపురం ఎన్నికలు

Karthik

మురసు తుఫాను కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ను ఒక రోజు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.  కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ మూడు మండలాల్లో జడ్పిటిసి, ఎంపీటీసీ పోలింగ్ ఈ నెల 6వ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు గమనించి సహకరించాలని కోరారు. మిగిలిన 10 మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఆయా మండలాల్లో ఐదవ తేదీ, గురువారం పోలింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరుగుటకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ లేదా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందని వివరించారు.ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review