GUNTUR CITY NEWS: మురసు’ తుఫాన్ ప్రభావం – గుంటూరు నగరంలో సహాయక చర్యలు ముమ్మరం!

Karthik

‘మురసు’ తుఫాన్ కారణంగా గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా, మేజర్ డ్రైన్లు పూర్తి సామర్థ్యంతో (ఫుల్ లెవల్) ప్రవహిస్తుండటంతో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు* . ⛺ *నగరంలో ఇప్పటికే పలు చోట్ల తుఫాన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా త్వరితగతిన ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు* .♦️ *ఇప్పటివరకు మురికిపేట & శాంతి నగర్: 150 మంది, బుడంపాడు ఎస్సీ కాలనీ 160 మంది, గణేష్ నగర్ (చెరువు ప్రాంతం – వారి ఇళ్ల వద్దనే): 100 మంది, బాలాజీ నగర్, నగరాలు (నవీన్ స్కూల్): 100 మంది, స్వర్ణ భారత్ నగర్: 20 మందికి పునరావాస కేంద్రాలుఏర్పాటు చేయడం జరిగింది* .♦️ *పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు సమయానికి అల్పాహారం, ఆహారం, సురక్షిత త్రాగునీరు అందుబాటులో ఉంచడమే కాకుండా, చలి బారి నుండి రక్షణగా దుప్పట్లు కూడా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.*🚜 *లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని త్వరితగతిన బెయిల్ అవుట్ (బయటకు పంపింగ్) చేసేందుకు జేసీబీలు, మోటార్ పంపులను యుద్ధప్రాతిపదికన అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు* .💧 *ఎక్కడా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఈలు (AEs) మరియు అమినిటీ కార్యదర్శులను ఆదేశించారు.*♦️ *ఈదురు గాలుల వల్ల రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించి, రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని ఏడీహెచ్ (ADH) ను ఆదేశించారు.*📞 *తుఫాన్ దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు లేదా సహాయం కావలసిన వారు ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా గుంటూరు నగర పాలక సంస్థ (GMC) కాల్ సెంటర్ 📞 0863 2345103 సంఖ్యకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని తెలిపారు.*♦️ *ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, నగర యంత్రాంగం 24 గంటలూ అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని కమిషనర్ తెలిపారు.

Author
Share This Article
Leave a review