Eluru District City news :స్థానిక పోరుకు జనసేన సన్నద్ధం-ఏలూరులో 62 డివిజన్ల నాయకులతో ఆత్మీయ సమావేశం

Sharat
1 View

ఏలూరు :-రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న వేళ ఏలూరు రాజకీయం వేడెక్కింది. స్థానిక సమరంలో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ శ్రేణులు సన్నాహకాలు వేగవంతం చేశాయి. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 62 డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో శనివారం సాయంత్రం కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, స్థానిక సంస్థల ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త, నియోజకవర్గ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

కూటమి ధర్మాన్ని కాపాడుతూ.. కలసికట్టుగా ముందడుగు:

ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన శ్రేణులు పూర్తిస్థాయి సమాయత్తంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా కూటమి స్ఫూర్తికి ఎలాంటి విఘాతం కలగకుండా, తెలుగుదేశం-జనసేన-భాజపా మూడు పార్టీల మధ్య పూర్తిస్థాయి సమన్వయాన్ని పాటిస్తూ ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకుని ఆరంభం నుంచి కష్టపడి పనిచేసిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తకు రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తాయని హామీ ఇచ్చారు.Eluru District news

గత అనుభవాల ప్రాతిపదికన వ్యూహాలు:

గతంలో ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో అప్పలనాయుడు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా డివిజన్లలో గతంలో ఎదురైన అనుభవాలు, స్థానిక సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డివిజన్‌లోనూ ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ బలోపేతం, ఎన్నికల ప్రచార ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో మరో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కార్యాచరణను మరింత వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:

ఈ సన్నాహక సమావేశంలో స్థానిక సంస్థల ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్తలు నారా శేషు, కస్తూరి సాయి తేజస్విని, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, నగర అధ్యక్షుడు వీరంకి పండు, గౌరవ అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, నగర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇళ్ల శ్రీనివాస్, లీగల్ సెల్ అధ్యక్షుడు నిమ్మల జ్యోతి కుమార్, క్లస్టర్ మరియు డివిజన్ ఇంచార్జీలు, పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review