GUNTUR DISTRICT NEWS: ఈనెల 25న ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్

Karthik

ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ను ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మతెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ జరుగుతుందని చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగ అభ్యర్థులు తమ సమస్యలను విన్నవించవచ్చని ఆయన చెప్పారు.

Author
Share This Article
Leave a review