తెనాలి మండలం బుర్రిపాలెంలో ఉన్నత అధికారులు బుధవారం పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అక్టోబర్ 4వ తేదీన పి.ఎం.ఏ.వై గ్రామీణ్ క్రింద మంజూరైన గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సీబా రాణి కొర్రపాటి, జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ, కేంద్ర మంత్రి పి.ఎస్ ఏ.కె.సింగ్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో ఏర్పాట్లు పరిశీలించారు. బుర్రిపాలెం గ్రామం పొలిమేరల్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో శంకుస్థాపన చేసిన అనంతరం, పలువురు లబ్ధిదారులతో మాట్లాడవచ్చని భావిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఐదు వేల మంది వరకు ప్రజలు బహిరంగ సభకు హాజరు కావచ్చని అందుకు తగిన విధంగా తాగు నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రహదారి మరమ్మతుల పనులు ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.శ్రీనివాస మూర్తి నేతృత్వంలో చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణ, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.శ్రీనివాస మూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తహసిల్దార్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు…
GUNTUR DISTRICT NEWS: బుర్రిపాలెంలో పర్యటించిన ఉన్నత అధికారులు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
overcast clouds
27° _ 27°
86%
1 km/h
Thu
34 °C
Fri
33 °C
Sat
33 °C


