GUNTUR DISTRICT NEWS: సీఎం చంద్రబాబుని కలిసిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్

Karthik

నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిర్చి యార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛైర్మన్ కుర్రా అప్పారావు సీఎం చంద్రబాబుకి ప్రగతి నివేదిక సమర్పించారు. యార్డ్ ఆధ్వర్యంలో రైతులకు అందించిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పై సీఎం కు వివరించారు. యార్డులో రైతులకు మెరుగైన మౌలిక వసతులు, పారదర్శక మార్కెటింగ్ సేవలు అందించేందుకు తీసుకున్న చర్యల వివరాలు ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన కుర్రా అప్పారావు. గుంటూరు మిర్చి యార్డు అభివృద్ధికి సంబంధించి వచ్చే ఏడాదికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించిన యార్డ్ చైర్మన్. మిర్చి రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు, అధిక ఆదాయం కల్పించేందుకు భవిష్యత్ ప్రణాళికలు. గుంటూరు మిర్చికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మిర్చి యార్డు చైర్మన్ పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review