గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని, ప్రతి డివిజన్‌లో రూ.10 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం 33వ డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు.ఈ సందర్భంగా 33వ డివిజన్ బ్రాడిపేట 2/17లోని బండ్లమూడి హనుమాయమ్మ కళాశాల సమీపంలో రూ.77 లక్షల వ్యయంతో 2/17 నుంచి 2/19 వరకు సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే లక్ష్మీపురం 1వ లైన్ నుంచి పండరిపురం అడ్డరోడ్డు వరకు రూ.42.80 లక్షలతో సీసీ డ్రెయిన్లు, ఆర్సీసీ కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1.19 కోట్ల (రూ.119.80 లక్షలు) విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని,గత పదేళ్లలో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు సరైన స్థాయిలో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.గత పాలకులు ప్రజల అవసరాలను కాకుండా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది వర్గాలకే పరిమితమై అభివృద్ధి పనులు చేపట్టారని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ సమానంగా చూస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని తెలిపారు.33వ డివిజన్‌లో ఇప్పటికే సుమారు రూ.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందించామని, నేడు మరో రూ.1.19 కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. అదనంగా రూ.3 కోట్లకు పైగా పనులు అంచనాల దశ పూర్తి చేసుకుని టెండర్ల కోసం సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ప్రతి డివిజన్‌లో రూ.10 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కూటమి నాయకులు, ప్రజలు కలిసి ముందుకు సాగుతున్నారని, ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోపురి నరేంద్ర, చింతకాయల శివ, వెంకటేష్ యాదవ్, నారాయణ రెడ్డి, గాయత్రి బెహరా, నాగరాజు, గోపి, బైరి కళ్యాణ్,ఉప్పుటూరి పేరయ్య,లక్ష్మి, ద్వారా పుల్లమ్మ,గుర్రం మల్లీశ్వరి,నిమ్మల ప్రశాంత్, కుంటా గోపి,దొంతి చంద్ర శేఖర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: ప్రతి డివిజన్‌లో రూ.10 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే మాధవి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
33°C
Vijayawada
overcast clouds
33° _ 33°
52%
6 km/h
Sat
33 °C
Sun
34 °C
Mon
35 °C


