నెల్లూరులో దివ్యాంగుల సమస్యలు – అధికారిపై చర్యలు కోరుతూ వినతి

City News Telugu

నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ జి. నారాయణస్వామిని ఇండియన్ డిజేబుల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. సతీష్ కలిసి నెల్లూరు జిల్లాలో దివ్యాంగుల సమస్యలను వివరించాడు.

జిల్లాలో దివ్యాంగుల కార్పొరేషన్ పనితీరు బలహీనంగా మారిందని, దివ్యాంగుల అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆరోపించాడు. ఏ.డి. మహమ్మద్ అయూబ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 80 త్రిచక్ర మోటార్ వాహనాల పంపిణీలో సరైన ప్రచారం లేకపోవడంతో కేవలం 39 మందిని మాత్రమే ఎంపిక చేయడం వల్ల 41 మంది దివ్యాంగులు అవకాశం కోల్పోయారని పేర్కొన్నాడు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ స్పందించాడు. సంబంధిత అధికారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు.

Share This Article
Leave a review