Guntur Local News :రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ

Sharat
1 View

గుంటూరు:- నగరంలోని హిందూ కాలేజ్ ఆవరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన సేవలు, ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సంతాప సభలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాష్ట్ర కాపు నాయకులు, ముద్రగడ అభిమానులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.

Author
Share This Article
Leave a review