Thadepalli :-శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తనను ఎంపిక చేసినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తూమాటి మాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తన ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించిన మండలి ఛైర్మన్‌కు, విపక్ష నేత బొత్స సత్యనారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన శాసనమండలి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
డిప్యూటీ ఛైర్మన్‌గా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తూమాటి మాధవరావు పేర్కొన్నారు.



