కేంద్రంలోని బిజెపి–ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి–యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు *జంగాల అజయ్ కుమార్ అన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్పొరేట్ శక్తుల హవా విపరీతంగా పెరిగిందని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ నియంతృత్వ ధోరణులు, నిరంకుశ వైఖరి పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశం *ఓటు హక్కు తొలగింపు* అని అన్నారు. కోట్లాది మంది ప్రజల ఓటు హక్కును హరించే అధికారం ఎన్నికల కమిషన్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. *ఎవరి అండతో, ఎవరి మెప్పు కోసం ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కార్యాలయాల వద్ద, ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి–యువజన సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.ప్రధాన డిమాండ్లు- కోట్లాది ఓట్ల తొలగింపును వెంటనే నిలిపివేయాలి.- *SIR ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి.* – తొలగించిన ఓట్లను యథావిధిగా పునరుద్ధరించాలి.- ఎన్నికల సంఘం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి.- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.* – *ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి.* ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా యువత ముఖ్యంగా జెన్ జి యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తోందని జంగాల అజయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ దమనకాండ, ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రశ్నిస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనీసం స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.ప్రజల ఆందోళనలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. *జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే విధానాలను వెనక్కి తీసుకునే వరకు, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత తీవ్రంగా కొనసాగుతాయని* స్పష్టం చేశారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, ఎన్డీఏ ప్రభుత్వం మరియు దాని భాగస్వామ్య పక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిపిఐ తరఫున జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.



