హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో కళలు, పాటలు, ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళాకారులను ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన (AINRS) పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. లకిడికపూల్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు షాహిద్ ఖాన్, కో-ఫౌండర్ రామకృష్ణ పాల్గొని కళాకారులను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా షాహిద్ ఖాన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘కులం కాదు.. మతం కాదు.. మనిషే ముఖ్యం’ అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఐక్యత, మానవత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.Hyderabad city news
గోమాతకు గౌరవం, రక్షణ కల్పించడంతోపాటు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు తగిన గౌరవం కల్పించడం, కళకు గుర్తింపు తీసుకురావడం, కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం AINRS పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు తెలిపారు.
కళాకారుల సేవలను గుర్తించి సన్మానించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.



