తాళ్లూరు: డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో డీఆర్‌డీఏ–వెలుగు ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వ్యవసాయ ఉత్పత్తుల సంస్థను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం తాళ్లూరు గ్రామంలోని డీఆర్‌డీఏ–వెలుగు ప్రాజెక్టు కార్యాలయంలో ప్రారంభించారు. వ్యవసాయ పనిముట్లను అద్దెకు అందుబాటులో ఉంచే విధంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలమైన పునాది వేశారని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, గ్యాస్ పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు కార్యక్రమాలతో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.Prakasam district news :దర్శిలో ఘనంగా ఆరో రోజు వినాయక చవితి వేడుకలు — 56 వేల నోట్ల దండతో లంబోదరుడికి ప్రత్యేక అలంకరణ
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని లక్ష్మి తెలిపారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించడం, సాగునీటి సరఫరాను మెరుగుపరచడం, ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేయడం కూడా వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే చర్యల్లో భాగమని పేర్కొన్నారు.
వెలుగు ప్రాజెక్టు ద్వారా మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేలా వ్యవసాయ పనిముట్లను అద్దెకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు ఈ కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.
వెలుగు ప్రాజెక్టు పరిధిలో మహిళలకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు, వివిధ పథకాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు క్రమం తప్పకుండా గ్రూప్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరేలా డ్వాక్రా సంఘాలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగువేణి–సుబ్బారావు, మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకారెడ్డి, ఎంపీడీవో అజిత, డీఆర్‌డీఏ–వెలుగు ప్రాజెక్టు అధికారులు, మండల టీడీపీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటకరంగ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, నాయకులు మన్నెం రమేష్, కొర్రపాటి వేణు, రాచకొండ వెంకట్రావు, కైపు నాగార్జున్‌రెడ్డి, నవ్వులూరి విద్యాసాగర్, కైపు కోటిరెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, శ్రీకాంత్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



