గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తల భేటీజరిగింది. శనివారం గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాట దీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడారు. మొక్కజొన్న కు ధర లేక రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. క్వింటా 2400 కొన్నాల్సిన మొక్కజొన్నను 1600 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు ఎనిమిది వందల వరకు నష్టపోతున్నారు. మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రేపు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రైతులు దీక్ష నిర్వహించనున్నారు. ఈ దీక్ష వల్ల మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలనేదే మా ఉద్దేశం. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ దీక్షలో సంఘీభావం తెలుపుతారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని క్వింటా మొక్కజొన్నను 2400 ను కొనుగోలు చేయాలని దీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఈ దీక్షకు రైతులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సూచించారు.



