గుంటూరు, ఏప్రిల్ 15:
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో శ్రీ మేధ విద్యాసంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. 2026 ఇంటర్ ఫలితాల్లో ఎంసిపిసి, బైపిసి, సిఇసి గ్రూపుల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి సంస్థకు గౌరవాన్ని తీసుకువచ్చారు.
ఎంసిపిసి గ్రూపులో అత్యధికంగా 982, 981, 979 మార్కులు సాధించగా, బైపిసి గ్రూపులో 494, 493, 492 మార్కులు సాధించిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. సిఇసి గ్రూపులో కూడా 489 మార్కులతో మంచి ప్రతిభ కనబరిచారు.
జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ విద్యార్థులు మొత్తం 21 మంది రాష్ట్ర స్థాయి టాప్ మార్కులు సాధించడం విశేషం. సంస్థలో అమలు చేస్తున్న నాణ్యమైన బోధన విధానం, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో
డి. లీల నాగ దుర్గ (982), వై. తన్వి శ్రీ (981), ఎం.ఎల్.వి నాగ యశస్విని (979), పి. కృష్ణ చైతన్య (977), జి. వంశీ ప్రియా (976), చి. తన్మయీ (976) తదితరులు ఉన్నారు.
అలాగే బైపిసి గ్రూపులో ఎం. షకీర్ (494), పి. రామ్ చరణ్ తేజ్ (493), వై.పి.వి శ్రీనివాస రావు (493) తదితరులు ప్రతిభ కనబర్చారు.
శ్రీ మేధ విద్యాసంస్థల డైరెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు సాధించేందుకు సంస్థ మరింత కృషి చేస్తుందని చెప్పారు.



