మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ముస్లిం హజ్ యాత్రకు వెళ్లిన వారికి వారి లగేజ్ ఇప్పటివరకు వారికి చేరలేదని చెప్పారు. బట్టలు, మెడిసిన్స్ అన్ని వస్తువులు వేరే చోట ఉండి పోయాయని అన్నారు. ఇప్పటికే 4 రోజులు గడిచిపోయిన నేపధ్యంలో హజ్ యాత్రికులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఈ అంశంపై ఛైర్మన్, అధికారులను సంప్రదించిన ఏమాత్రం స్పందించడం లేదన్నారు. పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణం అని ఆమె విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



