TB Mukt Bharat Abhiyan:టిబి నుంచి విముక్తి సాధిద్దాం: కర్లపాలెంలో అవగాహన కార్యక్రమం

Jaya Raju
11 Views

కర్లపాలెం: కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం గ్రామస్థాయిలో వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో టిబి వ్యాధిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

👉 మీ జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఇప్పుడే సందర్శించండి:
https://www.citymarriagebureau.com

ఈ సందర్భంగా హ్యాండ్ హోల్డ్ చెస్ట్ ఎక్స్‌రే పరికరంతో ఎంపిక చేసిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సూచనలు అందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం. గోపీనాథ్ గారు మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం చేసే వారు మరియు గనులు, క్వారీల్లో పనిచేసేవారు క్షయ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఒక వ్యక్తికి టిబి ఉన్నట్లయితే అది కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు వ్యాపించే ప్రమాదం ఉందని, దీని వల్ల ఆరోగ్యపరంగా మరియు ఆర్థికపరంగా తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ఆధునిక పరికరాలతో ప్రజల వద్దకే చేరుకొని వ్యాధులను గుర్తించి, తగు చికిత్స సలహాలు అందిస్తున్నదని తెలిపారు. అలాగే క్షయ వ్యాధి లక్షణాలపై కూడా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం సూపర్వైజర్ ఎస్‌సీహెచ్ దీప్తి, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ డి. కార్తీక్, ఎస్‌టీఎస్ శ్రీమతి పి. మేరీ, టిబి సూపర్వైజర్ డి. ధనుంజయ మరియు పిహెచ్సి సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review