GUNTUR DISTRICT NEWS: మేము మీ వద్దకే – కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల గ్రీవెన్స్

Karthik

మేము మీ వద్దకే వస్తాం అంటూ జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ నేరుగా దివ్యాంగుల వద్దకు వెళ్ళారు. శనివారం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఎస్.సి, ఎస్ టి, దివ్యాంగులకు ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కు నేరుగా అర్జీలు సమర్పించాలని దివ్యాంగులు వచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరిస్తున్న ప్రదేశం వద్దకు వెళ్ళుటకు పరిస్థితులు అనుకూలించలేదు. దీనిని గమనించిన జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ మీకెందుకు ప్రయాసలు.. మేమే మీ వద్దకు వస్తాం అంటూ వెళ్లి, వారి ఆర్జీలను స్వీకరించడమే కాకుండా ఎంతో ప్రేమగా పలకరించారు. “మీరే స్వయంగా మా వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించడం మీ దర్శనికతకు నిదర్శనం” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఒక భవనం ఏర్పాటుకు కృషి చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళుటకు అచ్చట అనుకూలంగా ఉండే ర్యాంపులు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయాలని దివ్యాంగులు కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అర్జీపై చర్యలు తీసుకుంటామని, అవకాశం మేరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రత్యేక పి.జి.ఆర్.ఎస్ లో ఎస్.సి, ఎస్ టి, దివ్యాంగులకు చెందిన అభ్యర్థులు తమకు సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని, ఉద్యోగం కల్పించాలని, వినికిడి ఉపకరణాలు పంపిణీ చేయాలని తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగ రాజు, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, జిల్లా విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review