2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీ పొందేందుకు 2 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, రాయితీ గడువు ఈ నెలాఖరు వరకే ఉందన్నారు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. నగరంలోని ఆస్తి, ఖాళీ స్థల పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.



